: రాజ్ నాథ్ సింగ్ తో ముగిసిన తెలంగాణ బీజేపీ నేతల భేటీ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో ఆ పార్టీ తెలంగాణ ప్రాంత నేతల భేటీ ముగిసింది. తెలంగాణలో పార్టీ బలోపేతం, రాష్ట్ర విభజన అంశాలపై పార్టీ అధ్యక్షుడితో చర్చించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత నాగం జనార్థనరెడ్డి మాట్లాడుతూ, బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ సాధన అసాధ్యమని తెలిపారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వెనకడుగు వేస్తే నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు.