: ఆఖరి పోరాటం.. భారత్, ఆస్ట్రేలియా ఫైనల్స్ నేడే!
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఏడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే ఆరు మ్యాచ్ లు జరగ్గా... వీటిలో 2-2 తో ఇరు జట్లు సమానంగా నిలిచాయి. మరో రెండు మ్యాచ్ లు వర్షార్పణం అయ్యాయి. దీంతో, ఈ రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న చివరి డేనైట్ వన్డే మ్యాచ్... సిరీస్ విజేతను తేల్చనుంది. ఈ మ్యాచ్ లో మరోసారి కోహ్లీ, బెయిలీ కీలకం కానున్నారు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు స్టార్ స్పోర్ట్స్, స్టార్ క్రికెట్, డీడీ నేషనల్ ఛానల్స్ లో ప్రసారం కానుంది.