: వంట గ్యాస్ ధర తగ్గిందోచ్.....
దీపావళి పండుగ సందర్భంగా వినియోగదారులకు చమురు సంస్థలు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధరను 53.50 రూపాయల వరకు తగ్గించాయి. గృహ వినియోగ సిలిండర్లే కాకుండా, వాణిజ్య సిలిండర్ల ధరలు కూడా తగ్గాయి. ఇటీవలే చమురు కంపెనీలు లీటరు పెట్రోలు ధరను రూ. 1.15 చొప్పున తగ్గించిన విషయం తెలిసిందే.