: నేడు బెంగళూరు వెళ్లనున్న ముఖ్యమంత్రి
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం బెంగళూరు వెళ్లనున్నారు. కుటుంబసభ్యులతో గడిపేందుకే ఆయన బెంగళూరు వెళ్తున్నట్టు సమాచారం. బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లాలో ఉన్న తన తల్లి వద్దకు కూడా సీఎం వెళ్తారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సీఎం, దీపావళి పండుగ సందర్భంగా రెండు రోజుల పాటు కుటుంబంతో సరదాగా గడపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.