: 42 ప్రైవేటు బస్సుల సీజ్
ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన బస్సులపై రవాణా శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. మూడో రోజు నిర్వహించిన దాడుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 42 బస్సులను సీజ్ చేశారు. ఇవన్నీ కూడా సరైన డాక్యుమెంట్లు, పర్మిషన్స్ లేకుండా తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు. నిజామాబాద్ లో 2, నెల్లూరులో 1, ఆదిలాబాద్ లో 6, ఏలూరులో 16, అనంతపురంలో 1, మెదక్ లో 5, గుంటూరులో 9, కృష్ణా జిల్లాలో 2 బస్సులను సీజ్ చేశారు.