: నీట్ పై సుప్రీం ఆదేశాలను పాటిస్తాం: ఐవీ రావు


జాతీయ వైద్య పరీక్ష (నీట్)ను నిర్వహించే విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీ డా. ఐవీ రావు వెల్లడించారు. ఈ ఏడాది ఎంసెట్ తో పాటు నీట్ పరీక్ష కూడా ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శటీ 16వ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

కాగా, ఈరోజు సుప్రీంలో నీట్ పై రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలు ముగించింది. ఆర్టికల్ 371 (డి) అనుసరించి సొంత ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు మార్గం సుగమం చేయాలని కోరింది. అలా కాకుంటే, రాజ్యాంగ సవరణ చేసైనా తమకు వెసులుబాటు కల్పించాలని.. ప్రభుత్వం సుప్రీంకు తన వాదనలు వినిపించింది. 

  • Loading...

More Telugu News