: రాతకన్నా ముందు సంగీతం నేర్చుకున్నారట!
మన పూర్వీకులు ముందుగా ఏ విద్యను నేర్చుకుని ఉంటారు... మన జీవనాన్ని తర్వాతి తరాల వారికి అందించే రాతనా? లేక మనకు మానసిక ప్రశాంతతను చేకూర్చే సంగీతాన్నా...? అంటే సంగీతాన్నే అని చెప్పాల్సి వస్తోంది. ఎందుకంటే, పురాతన తవ్వకాల్లో లభించిన సమాధుల్లో సంగీతానికి సంబంధించిన వేణువులు లభించాయి. దీంతో పూర్వీకులు రాతకన్నా ముందుగా సంగీతాన్నే సాధన చేసివుంటారని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
సెంట్రల్ చైనాలోని హెనాన్ రాష్ట్రంలో ఒక పురాతన సమాధి వద్ద జరిపిన తవ్వకాల్లో 9 వేల ఏళ్లనాటి అస్థి వేణువులు బయటపడ్డాయి. ఎముకలతో తయారుచేసిన మూడు ఎర్రటి వేణువులు ఇక్కడ లభించాయని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తే మన పూర్వీకులు రాతకన్నా ముందుగా సంగీతం నేర్చుకుని ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.