: మనం కదిలితే కరంటే!


మనం కదిలితే ఏమవుతుంది...? అంటే కరెంటు పుడుతుంది. ఎలా పుడుతుంది అనుకుంటున్నారా... మన కదలికల్లో నుండే కరెంటు పుడుతుంది, దీన్ని చక్కగా ఒడిసిపట్టి మన మొబైల్‌ను చార్జింగ్‌ చేసుకోవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలాంటి ఒక సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు తయారుచేస్తున్నారు. మనిషి కదలికలనుండి కరెంటును ఉత్పత్తి చేసే ఈ సరికొత్త మొబైల్‌ జనరేటర్‌కు జెన్నియో అని పేరు కూడా పెట్టారు.

కిక్‌ స్టార్టర్‌ అనే వెబ్‌సైట్‌లో జెన్నియో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను దాని రూపకర్తలు తెలిపారు. జెన్నియోను మన శరీరానికి తగిలించుకుని, దానికి ఫోన్‌కి యూఎస్‌బీతో అనుసంధానం చేస్తే మన ఫోన్‌ ఛార్జింగ్‌ అవుతుంది. ఐదు గంటలపాటు దీన్ని శరీరానికి తగిలించుకుంటే మనం గంటసేపు మాట్లాడేందుకు వీలుగా మన మొబైల్‌ ఛార్జింగ్‌ అవుతుందని దీని రూపకర్తలు చెబుతున్నారు. ఈ పరికరాన్ని ఒక నిమిషం పాటు కదిపితే మూడు నిమిషాల పాటు మాట్లాడుకునేందుకు వీలుగా మన ఫోన్‌ ఛార్జింగ్‌ అవుతుందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News