: ద్రవాలపై కూడా బొమ్మలు గీయవచ్చు
ఇప్పటి వరకూ ఘన స్థితిలో ఉండే పదార్ధాలపై మాత్రమే బొమ్మలు గీసేవాళ్లు. ఇకపై ద్రవ పదార్ధాలపై కూడా బొమ్మలు గీయవచ్చు. అదేంటి... ద్రవం కదులుతుంది కదా... దానిపై బొమ్మ గీయడం ఎలా సాధ్యం అనుకుంటున్నారా... లేజర్ కాంతితో ఇది సాధ్యమేనంటున్నారు శాస్త్రవేత్తలు.
లేజర్ కాంతితో ఎల్‌సీడీ మానిటర్, ఘనస్థితి ఉపరితలాలపై మాత్రమే బొమ్మలు గీయడం ఇప్పటి వరకూ సాధ్యమయ్యేది. అలాకాకుండా ద్రవస్థితిలో ఉండే ఉపరితలాలపై కూడా లేజర్ కాంతితో బొమ్మలు గీయడం సాధ్యమేనని హెల్సెంకి విశ్వవిద్యాలయానికి చెందిన రసాయన శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల ద్వారా నిరూపించారు.