: మక్బూల్ ను కోర్టులో హాజరు పర్చిన ఎన్ఐఏ.. 13 వరకు రిమాండ్


ఇండియన్ ముజాహిదిన్ తీవ్రవాది సయ్యద్ మక్బూల్ ను ఎన్ఐఏ అధికారులు నేడు కోర్టులో హాజరు పరిచారు. మక్బూల్ పై గత కేసులకు సంబంధించి పీటీ వారెంట్ జారీ చేయాలంటూ ఎన్ఐఏ.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా, కోర్టు మక్బూల్ కు ఈనెల 13 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇక హైదరాబాద్ పేలుళ్ల కేసులో ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాది రియాజ్ భత్కల్ సహా మరో 9 మందిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. 

  • Loading...

More Telugu News