: ఇన్ని కోట్ల నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లా? వామ్మో....!
ఫేస్ బుక్.. అంతర్జాలాన్ని ఊపేస్తున్న పదం. ఫేస్ బుక్ కు బానిసలై జీవితాల్ని అంతం చేసుకుంటున్న ఉదంతాలు ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్నాయి. వ్యక్తుల మధ్య భావాలను పంచుకునేందుకు ఫేస్ బుక్ సరైన వేదిక. అయితే ఫేస్ బుక్ కు కూడా నకిలీల బెడద తప్పడం లేదు. యూఎస్ సెక్యూరిటీ ఎక్చేంజ్ కమిషన్ నివేదిక ప్రకారం భారత్, టర్కీల్లో 14.3 కోట్ల నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు ఉన్నాయట. ప్రపంచవ్యాప్తంగా 119 కోట్ల మందికి ఫేస్ బుక్ అకౌంట్లు ఉన్నాయి. ఇందులో 7.9 శాతం నకిలీ అకౌంట్లే. మరో 2.1 శాతం మంది తమ అకౌంట్లను దుర్వినియోగ పరుస్తుండగా, వీటిలో 1.2 శాతం తొలగించినట్టు కమిషన్ తెలిపింది. నకిలీ ఖాతాల్లో అమెరికా, యూకేల కంటే భారత్, టర్కీలు ముందంజలో ఉన్నాయి.