: నల్గొండ జిల్లా ప్రజలకు చంద్రబాబు హామీ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నల్గొండ జిల్లాలో వరద బాధితులను పరామర్శిస్తున్నారు. తిప్పర్తి మండలం మామిడాల వద్ద పాలేరు వాగుపై తెగిన వంతెనను ఆయన ఈ సాయంత్రం పరిశీలించారు. తాము అధికారంలోకి వస్తే ఆరు కోట్ల రూపాయలతో పాలేరు వాగుపై పటిష్ఠ వంతెన నిర్మిస్తామని బాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.