: కూర్గ్ ల్యాండ్ ఏర్పాటు చేయాలని జంతర్ మంతర్ వద్ద ధర్నా


తెలంగాణ ఏర్పాటు ప్రకటన దేశంలో పలు డిమాండ్లకు ఊతమిచ్చింది. కాంగ్రెస్ పార్టీ విభజన దిశగా కదులుతుండడంతో ప్రత్యేక రాష్ట్ర వాదనలు ఊపందుకుంటున్నాయి. గూర్ఖాల్యాండ్, బోడో ల్యాండ్, విదర్భ, కార్బిల్ ల్యాండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేయాలంటూ ఆయా రాష్ట్రాల్లో ఉద్యమాలు తీవ్రం చేస్తున్నారు. మరోవైపు, కూర్గ్ ల్యాండ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో కర్నాటకలోని కూర్గ్ ల్యాండ్ ప్రాంతానికి చెందిన వందలాది మంది ప్రజలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. కూర్గ్ బ్యానర్లు, రిబ్బన్లు ధరించిన వందలాది మంది రాంలీలా మైదాన్ లో సమావేశమై జంతర్ మంతర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కూర్గ్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని వారు నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News