: ఆధార్ కార్డుతో గ్యాసును ముడిపెట్టరాదు: మమతా బెనర్జీ


వంట గ్యాసుపై సబ్సిడీ పొందేందుకు ఆధార్ కార్డును తప్పనిసరి చేయరాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈ విషయంపై కేంద్ర పెట్రోలియం శాఖ వెంటనే దిద్దుబాటు చర్యలను చేపట్టాలని సూచించారు. ఇప్పటిదాకా 15 నుంచి 20 శాతం ప్రజలు మాత్రమే ఆధార్ కార్డులను పొందారని... మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని హౌరా, కూచ్ బెహర్ జిల్లాల్లో ఆధార్ కార్డు అనుసంధానాన్ని కంపల్సరీ చేస్తూ... స్థానిక పత్రికల్లో కేంద్ర పెట్రోలియం శాఖ ఇచ్చిన ప్రకటనను చూసిన మమత ఈ విధంగా స్పందించారు. ప్రభుత్వ సబ్సిడీలు పొందేవారిని ఆధార్ కార్డులతో ముడిపెట్టరాదని సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులిచ్చిందని మమత అన్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా కేంద్ర ప్రభుత్వం లెక్క చేయడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News