: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు దిగ్విజయ్ కుమారుడి నామినేషన్
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ కుమారుడు జైవర్ధన్ సింగ్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేశాడు. రాగోగఢ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జైవర్ధన్ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి స్థానిక అధికారులకు నామినేషన్ పేపర్లు సమర్పించాడు. మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గానూ నామినేషన్ల దాఖలు పర్వం ఈ రోజే మొదలైంది. మరోవైపు, పోటీచేసే పార్టీ అభ్యర్ధుల జాబితాను కాంగ్రెస్ ఈ రోజు విడుదల చేసింది. ఈ నెల 25న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.