: రాష్ట్రంలోని కర్ణాటకేతరులు కన్నడ నేర్చుకోవాల్సిందే: సీఎం సిద్ధరామయ్య
వేరే ప్రాంతాలనుంచి వచ్చి కర్ణాటకలో స్థిరపడిన వారు తప్పకుండా కన్నడ భాష నేర్చుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. అయితే, ఆంగ్ల భాషా విద్యా వ్యవస్థ వాణిజ్యమయమైందన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. కర్ణాటక రాష్ట్రం అవతరణ సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధరామయ్య పైవిధంగా మాట్లాడారు. ఒక రాష్ట్రంలో ఉండి సౌకర్యాలు, ప్రయోజనాలు పొందుతున్నప్పుడు అక్కడి భాష నేర్చుకోవడం అవసరమన్నారు. కాగా, ప్రభుత్వం కన్నడ పాఠశాలలను మూసివేయదని తెలిపారు. ఒక భాష నేర్చుకునే క్రమంలో మరో భాషను పక్కకు పెట్టడం సరికాదన్నారు. ఒకానొక సమయంలో పిల్లలకు వారి బోధనా మాధ్యమాన్ని ఎంచుకునే అవకాశం ఇవ్వాలని.. అయితే, విద్యా వ్యవస్థలో వారి తల్లి భాషను వారికి అందించడం చాలా మంచిదని వివరించారు.