: ఆస్ట్రేలియాలో జీవీకే ప్రాజెక్టు


ప్రముఖ సంస్థ జీవీకే ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ లో తలపెట్టిన కెవిన్స్ కార్నర్ కోల్ మైనింగ్ ప్రాజెక్టుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం పర్యావరణ అనుమతి ఇచ్చింది. 2011లో జీవీకే గ్రూప్ ఆస్ట్రేలియాలోని కెవిన్స్ కార్నర్ ప్రాజెక్టులో వంద శాతం వాటాను తీసుకుంది. దాంతోపాటు, ఆల్ఫా కోల్, ఆల్ఫా వెస్ట్ కోల్ ప్రాజెక్టులలో 79 శాతం వాటా పొందింది. దీనిపై జీవీకే పవర్, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీవీకే రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనదన్నారు. అనేకమందికి ఉద్యోగవకాశాలు లభిస్తాయని తెలిపారు.

  • Loading...

More Telugu News