: సోనియాకు కృతజ్ఞత సభ షెడ్యూల్లో స్వల్ప మార్పులు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కృతజ్ఞత తెలిపేందుకు నిర్వహిస్తున్న సభ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లు మంత్రి జానారెడ్డి తెలిపారు. ఈ నెల 9న వరంగల్, 13న ఆదిలాబాద్, 17న రంగారెడ్డి, 20న మెదక్, 24న కరీంనగర్ లో సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అప్పట్లో రాష్ట్రం సమైక్యంగా ఉండడమే మంచిదని ఇందిరాగాంధీ అభిప్రాయపడిన మాట వాస్తవమేనన్న జానా, ఇప్పుడు ఆమే ఉండుంటే ఆలస్యం చేయకుండా తెలంగాణ ప్రకటించేవారన్నారు.