: మతతత్వాన్ని రెచ్చగొట్టేందుకే మోడీ 'సంతాప యాత్ర': నితీష్ కుమార్
నరేంద్ర మోడీపై బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి విరుచుకుపడ్డారు. పాట్నా బాంబు పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించే నెపంతో... 'సంతాప యాత్ర' చేపట్టిన మోడీ.. మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని నితీష్ దుయ్యబట్టారు. ఇక్కడి సామరస్యపూర్వక వాతావరణాన్ని మోడీ కలుషితం చేయాలనుకుంటున్నారని అన్నారు. ఆయన ఎలాంటి గిమ్మిక్కులు చేసినా తామంతా మత సామరస్యంతో మెలుగుతామని చెప్పారు.