: కొత్త పార్టీ గురించి కిరణ్, బొత్సలను అడగండి: జేసీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. ఆ విషయం గురించి కిరణ్, బొత్సలను అడగాలని సూచించారు. కాగా, జగన్, కాంగ్రెస్ మధ్య జేసీ మధ్యవర్తిత్వం వహిస్తున్నారేమోనన్న బొత్స వ్యాఖ్యలపై జేసీ చాలా తెలివిగా సమాధానమిచ్చారు. బొత్స తమ వాడేనని.. అవసరమైతే అధిష్ఠానం, జగన్ మధ్య మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని జేసీ అన్నారు. బొత్స కక్ష సాధింపు, సీఎం లాలూచీ అని తాను వ్యాఖ్యానించాలని మీడియా భావిస్తున్నట్టుందని అభిప్రాయపడ్డారు.