: మేఘాలయ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ముకుల్ సంగ్మా


మేఘాలయ 23వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత ముకుల్ సంగ్మా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన సీఎం పదవిని చేపట్టడం ఇది రెండోసారి. షిల్లాంగ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మేఘాలయ గవర్నర్ ఆర్ఎస్ మూషాహరీ.. ముకుల్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

వచ్చేవారం లోపు సంగ్మా తన నూతన క్యాబినెట్ మంత్రుల జాబితాను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల ప్రకారమే బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు. పార్టీ అధిష్టానంతో చర్చించిన అనంతరమే క్యాబినెట్ విస్తరణ చేపడతానని చెప్పారు.

ఫిబ్రవరి మొదటి వారంలో 60 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 29 స్థానాలు గెలుచుకొని మేఘాలయలో అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే, స్పష్టమైన మెజారిటీకి రెండు సీట్ల దూరంలో నిలిచిపోయిన అధికార పార్టీకి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (2 సీట్లు)తో పాటు మరో 11 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు భేషరతు మద్దతు పలికారు. 

  • Loading...

More Telugu News