: బొత్సే కారణమని ప్రజలు నమ్ముతున్నారు: ఎమ్మెల్యే సుజయకృష్ణ
రాష్ట్ర విభజనకు పీసీసీ చీఫ్ బొత్సే కారణమని విజయనగరం జిల్లా ప్రజలు బలంగా నమ్ముతున్నారని బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు తెలిపారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో ఓ వైపు 30 యాక్టును అమలు చేస్తూ కర్ఫ్యూ వాతావరణం కొనసాగించడం సరికాదని అన్నారు. న్యాయవాదుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవాల్సిన అవసరం ఏంటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. పోలీసుల తీరు వల్లే నగరంలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయని ఆయన విమర్శించారు.