: హైదరాబాదులో ప్రపంచ కృత్రిమ అవయవాల ప్రదర్శన
అంగవైకల్యాన్ని అధిగమించడానికి ఆలంబన అందించేవి కృత్రిమ అవయవాలు. వీటిని వాడటం ద్వారా వికలాంగుల మనోధైర్యం పెరుగుతుంది. అందుకే వీటిపై అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన దేశంలో 80 శాతం వికలాంగులు గ్రామాల్లోనే ఉన్నారని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి బలరాం నాయక్ అన్నారు. ఆధునిక కృత్రిమ అవయవాలు, వాటిపై ఉన్న పథకాలపై వీరిలో సరైన అవగాహన లేదని ఆయన అన్నారు.
వికలాంగులకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ లో 14వ ప్రపంచ కృత్రిమ అవయవాల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న నిపుణుల సదస్సుకు 84 దేశాలకు చెందిన కీళ్లు, ఎముకల శస్త్ర చికిత్స నిపుణులు, కృత్రిమ కీళ్ల శాస్త్రవేత్తలు హాజరయ్యారు. నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరగనుందని నిర్వాహకులు తెలిపారు.