: కవిత, విమలక్కల నినాదాలతో దద్దరిల్లిన గన్ పార్కు
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిరసిస్తూ తెలంగాణవాదులు నిరసనలు తెలిపారు. నవంబర్ 1ని విద్రోహదినంగా పరిగణిస్తూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్క నినాదాలు చేశారు. సీమాంధ్ర నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని శపథం చేశారు.