: డీజిల్ ధర పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి: కేంద్రాన్ని కోరిన జయ


డీజిల్ ధరను లీటర్ కు 50 పైసలు పెంచడం పట్ల తమిళనాడు సీఎం జయలలిత స్పందించారు. పెంచిన డీజిల్ ధరను తగ్గించాలని ఆమె నేడు కేంద్రాన్ని కోరారు. డీజిల్ ధర పెంపు రవాణా చార్జీల పెరుగుదలకు, తద్వారా ప్రజలపై పెనుభారం పడడానికి కారణమవుతుందని ఆమె పేర్కొన్నారు. ధరలను పెంచుకునే అవకాశాన్ని చమురు సంస్థల నుంచి కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలానే చమురు ధరలు పెంచుతూ పోతే, వచ్చే ఎన్నికల్లో ప్రజలు యూపీఏకు వ్యతిరేకంగా ఓటేయాలన్న నిర్ణయం తీసుకుంటారని జయ అభిప్రాయపడ్డారు.

కాగా, డీజిల్ ధర పెంపు నేపథ్యంలో మిగతా రాష్ట్రాల్లో తాము రవాణా చార్జీలు పెంచడంలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు వాటిల్లే నష్టాన్ని తాము భరిస్తామని జయ తెలిపారు. గతేడాది రూ. 200 కోట్లు విడుదల చేశామని, ఈ ఏడాది ఇప్పటివరకు రూ.500 కోట్లను రవాణా సంస్థకు కేటాయించామని జయ వివరించారు.

  • Loading...

More Telugu News