: విజయనగరం మరోసారి ఉద్రిక్తం


కొద్ది రోజుల క్రితం సమైక్యాంధ్ర ఉద్యమంతో అట్టుడుకిన విజయనగరంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు ఉదయం సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. అయితే, పట్టణంలో 30 యాక్ట్ అమల్లో ఉందని... ర్యాలీ నిర్వహించడానికి వీల్లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులకు, లాయర్లకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుని... చివరకు ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రంలో ఎక్కడా లేని 30 యాక్ట్ ను ఇక్కడే ఎందుకు అమలు చేస్తున్నారని పోలీసులను న్యాయవాదులు ప్రశ్నించారు. అంతేకాకుండా, విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి... పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News