: సెబి చీఫ్ నియామకాన్ని సమర్థించిన సుప్రీం కోర్టు


సెబి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కొత్త ఛైర్మన్ గా యు.కె.సిన్హా నియామకం సబబేనని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ నిజ్జర్, జస్టిస్ గోఖలేలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. సిన్హా నియామకం పూర్తిగా నియమ నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని స్పష్టం చేసింది.

సెబి చీఫ్ గా సిన్హా నియామకాన్ని సవాలు చేస్తూ అరుణ్ కుమార్ అగర్వాల్ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన నియామకంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని అగర్వాల్ పిటిషన్ లో పేర్కొన్నారు. సెబి ఛైర్మన్ గా నియమితమయ్యే వ్యక్తి సమాజంలో ఉన్నతస్థాయిని కలిగి ఉండాలని... సిన్హాకు అది లేదని అగర్వాల్ వాదించారు. అయితే, ఆయన వాదనలను కోర్టు కొట్టేసింది.

  • Loading...

More Telugu News