: మహిళ గొంతు కోసి పరారైన దుండగుడు 01-11-2013 Fri 11:57 | నల్గొండ జిల్లా సూర్యాపేట భగత్ సింగ్ నగర్ లో దుండగుడు బ్లేడుతో ఓ మహిళ గొంతు కోసి పరారయ్యాడు. గాయపడిన మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారైన దుండగుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.