: ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటా: లగడపాటి
కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇక ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, కొందరు స్వార్థ ప్రయోజనాల కోసమే తెలుగుతల్లిని ముక్కలు చేస్తున్నారని ఆరోపించారు. విభజనను అడ్డుకునేందుకు కడదాకా పోరాడతామని చెప్పుకొచ్చారు. విభజన తీర్మానం అసెంబ్లీకి వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. పార్టీలు ప్రాంతాలవారీగా విడిపోవడం వల్లే అఖిలపక్ష సమావేశం మళ్ళీ ఏర్పాటు చేస్తున్నారని లగడపాటి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అవతరణ వేడుకలు ఇకపైనా జరుగుతాయని స్పష్టం చేశారు.