: అమెరికన్ భారతీయుడికి శృంగేరి 'ధర్మాత్మ' అవార్డు
సుప్రసిద్ధ శృంగేరి శంకరాచార్య పీఠం అవార్డు ఓ అమెరికన్ భారతీయుడిని వరించింది. శృంగేరి శంకరాచార్య పీఠాధిపతి భారతీ తీర్ధానంద మహాస్వామి 'ధర్మాత్మ' అవార్డును అమెరికాకు చెందిన ఎస్. యజ్ఞ సుబ్రహ్మణ్యంకు ప్రదానం చేసినట్లు ఒక ప్రకటన విడుదలైంది. సుబ్రహ్మణ్యం న్యూజెర్సీలో ఉంటారు. ప్రముఖ హిందూనేతగా ఆయనకు గుర్తింపు ఉంది. న్యూజెర్సీలోని అమెరికన్ హిందూ ఆలయం, సాంస్కృతిక కేంద్రం, శృంగేరి విద్యాభారతి ఫౌండేషన్ కు ఆయన చైర్మన్ గా కూడా ఉన్నారు. శృంగేరి పీఠం నుంచి ఇప్పటి వరకు ఇలాంటి గౌరవం పొందిన ముగ్గురిలో సుబ్రహ్మణ్యం ఒకరు.