: రష్యా వెబ్ సైట్ లో ఎడ్వర్డ్ స్నోడెన్ కు ఉద్యోగం


ప్రస్తుతం రష్యాలో ఆశ్రయం పొందుతున్న అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ) మాజీ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్ ఓ వెబ్ సైట్ లో ఉద్యోగం సంపాదించాడు. ఈ విషయాన్ని స్నోడెన్ కు సహాయం చేస్తున్న ఓ రష్యన్ లాయర్ తెలిపినట్లు ఆ దేశ వార్తా పత్రిక 'ఆర్ఐఎ' తన కథనంలో పేర్కొంది. ఈ నెల నుంచే విధుల్లో చేరతాడని.. అయితే, సెక్యూరిటీ కారణాలవల్ల వెబ్ సైట్ పేరు చెప్పలేమని అన్నాడు. జూన్ నెలలో అగ్రరాజ్యం అమెరికా రహస్య విషయాలను బయటపెట్టిన స్నోడెన్, అనంతరం హాంకాంగ్ కు, అటునుంచి రష్యాకు పారిపోయాడు. అప్పటినుంచి తాత్కాలిక ఆశ్రయం మీద రష్యాలోనే ఉంటున్నాడు. ఇప్పుడీ ఆశ్రయాన్ని సంవత్సరానికి పెంచే అవకాశం కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News