: రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ నోటీసు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొన్న రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో, వెంటనే బీజేపీ ఈసీకి ఆరు పేజీల ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఫిర్యాదును పరిశీలించిన కమిషన్ రాహుల్ కు నోటీసు ఇచ్చింది.