: పాట్నా పేలుళ్ల ప్రధాన నిందితుడి మృతి


బీహార్ రాజధాని పాట్నా నగరంలో చోటు చేసుకున్న పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు అయినిల్ అలియాస్ తారిఖ్ ఈ తెల్లవారుజామున చనిపోయాడు. పేలుళ్ల సమయంలో తీవ్రంగా గాయపడిన నిందితుడు ఇందిరాగాంధీ మెడికల్ ఇన్ స్టిట్యూట్ లో చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లాడు. దాంతో, మరణించాడని వైద్యులు వెల్లడించారు. ఈ కేసులో ఇంతవరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News