: తెలంగాణ జేఏసీ జెండాను ఎగురవేసిన కోదండరాం
తెలంగాణ విద్రోహదినం సందర్భంగా హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద టీ జేఏసీ జెండాను ప్రొఫెసర్ కోదండరాం ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీజేఏసీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నవంబర్ 1ని (రాష్ట్ర అవతరణ దినోత్సవం) తెలంగాణ విద్రోహదినంగా టీ జేఏసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.