: సెల్లు నీట జారినా ఫరవాలేదు


మీ చేతిలోని సెల్‌ఫోన్‌ జారి నీటిలో పడిపోయిందంటే ఇక అంతే సంగతులు, దానిపై ఆశలు వదులుకోవాల్సిందే. అలాకాకుండా నీటిలో పడినా కూడా ఫోన్‌ పనిచేసేలా కొత్త రకం సెల్‌ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు వాటర్‌ ప్రూఫ్‌ పేరుతో సెల్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఫోన్లు సర్వసాధారణం కూడా అయిపోయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తల పరిశోధన ఫలితంగా కేవలం సెల్‌ఫోన్లు మాత్రమే కాకుండా చాలా రకాల ఎలక్ట్రానిక్‌ వస్తువులు కూడా వాటర్‌ ప్రూఫ్‌లుగా అందుబాటులోకి రానున్నాయి.

ఇప్పటికి సెల్‌ఫోన్లలోని ఆర్గానిక్‌ లైట్‌ ఎమిటింగ్‌ డయోడ్‌ (ఓఎల్‌ఈడీ)లు పొరబాటున తడిస్తే పాడైపోతున్నాయి. వీటికి రక్షణ కవచంలాంటి అటామిక్‌ లేయర్‌ డిపొజిషన్‌ పద్ధతిలో ఒక ఫిల్మ్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది చాలా పలుచనైంది. ఎంత పలుచనైంది అంటే కేవలం పది నానో మీటర్లు మాత్రమే మందంగా ఉంటుందట. కానీ ఎంతో మన్నికైందట. ఇప్పుడు వాడుతున్న ఫిల్మ్‌లు దీనికంటే వేల రెట్లు ఎక్కువ మందంగా ఉంటాయని, ఈ ఫిల్మ్‌లను కేవలం సెల్‌ఫోన్లలోనే కాకుండా భవిష్యత్తులో బయోమెడికల్‌ పరికరాలు, ఎల్‌ఈడీ ఆధారిత లైటింగ్, డిస్‌ప్లేలు, సోలార్‌ సెల్స్‌, ఆర్గానిక్‌ ఎలక్ట్రానిక్‌ విండోస్‌లలో కూడా ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News