: ఇది పాకిస్థానా? లేక బంగ్లాదేశా?: విజయమ్మ


'ఇది పాకిస్థానా? లేక బంగ్లాదేశా? కాదంటే నాపై ఏమన్నా రౌడీ షీటుందా?' అని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తన అరెస్టుపై ఘాటుగా స్పందించారు. ఖమ్మం, నల్గొండ జిల్లా సరిహద్దు గ్రామమైన పైనంపల్లివద్ద ఆమె మాట్లాడుతూ, 'భారీ వరదలకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు, ధైర్యం చెప్పేందుకు వస్తే రాజకీయ కారణాలతో పర్యటనను అడ్డుకుంటారా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?' అని ప్రశ్నిచారు. ప్రజలంతా కలసిమెలసి ఉండాని తాము కోరుకుంటున్నామని, అది తప్పా? అని తన పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చిన నేతలను నిలదీశారు.

తెలంగాణ ప్రజలు రాజశేఖరరెడ్డిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని కొంతమంది రాజకీయ నాయకులు, పార్టీలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్పుడు మార్గాల్లో నడుస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను కలవనీయకుండా ప్రభుత్వమే అడ్డుకోవడం దారుణమన్న విజయమ్మ.. సమైక్యవాదం వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో పర్యటిస్తే ఆయననూ ఇలాగే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News