: టీడీపీ ఎనాటికీ కాంగ్రెస్ లో కలవదు: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ ఏనాటికీ కాంగ్రెస్ పార్టీలో కలవదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆ పార్టీపై తొలి నుంచి తాము తీవ్రమైన పోరాటం చేస్తూ వచ్చామని బాబు తెలిపారు. గుంటూరులో జిల్లాలో వరద బాధితులను, పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన బాబు.. ఆ సందర్భంగా మాట్లాడారు. 16 జిల్లాల్లో ఎన్నడూ చూడని వర్షాలు పడితే, బాధితుల కడగండ్లు మంత్రులకు కనిపించడంలేదని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను రెండుసార్లు గెలిపిస్తే, ప్రజల పట్ల ఆ పార్టీ కృతజ్ఞత చూపడంలేదని విమర్శించారు.