: జగన్, విజయమ్మలను తెలంగాణ ప్రజలు ఇష్టపడటం లేదు: హరీష్ రావు


వైఎస్సార్సీపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్, విజయమ్మ ముఖాలు చూడటానికి తెలంగాణ ప్రజలు ఇష్టపడటం లేదన్నారు. తెలంగాణను కొల్లగొట్టింది వైఎస్ కుటుంబమేనని, భర్త చేసిన వినాశనాన్ని చూడటానికే విజయమ్మ తెలంగాణలో పర్యటిస్తున్నారా? అని ప్రశ్నించారు. వెయ్యిమంది త్యాగాలకన్నా, కొడుకు సుఖమే విజయమ్మకు ముఖ్యమా? అని హరీష్ రావు అడిగారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ మోసాలకు డిక్షనరీలో పదాలే దొరకడం లేదని వ్యాఖ్యానించారు. విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, అందుకే నిధులన్నీ ఆదరాబాదరాగా తరలించుకుపోతున్నారని ఆరోపించారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు విషయమై తెలంగాణ మంత్రులు వెంటనే స్పందించాలన్నారు.

  • Loading...

More Telugu News