: అఖిలపక్ష సమావేశాన్ని స్వాగతించిన కిషన్ రెడ్డి


కేంద్ర హోంశాఖ మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వాగతించారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇదివరకు కాంగ్రెస్ చేసిన ప్రకటనకు కట్టుబడి శీతాకాల పార్లమెంటు సమావేశం తొలిరోజునే తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల మధ్య వైషమ్యాలు మరింత తీవ్రం కాకముందే కేంద్రం విభజన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కోరారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా కాంగ్రెస్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కిషన్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో అధికార పార్టీతో పాటు ఇతర పార్టీలు విభజనపై సీమాంధ్ర ప్రజలను ఇంకా మోసం చేయడం మానుకోవాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News