: ఎయిడ్స్ నియంత్రణ కార్యాలయంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు
తాజాగా మరో బాంబు కలకలం రేగింది. ఈసారి హైదరాబాద్ లోని కోఠిలో ఉన్న ఎయిడ్స్ నియంత్రణ మండలిలో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. కార్యాలయంలో ఉన్న సిబ్బందిని బయటకి పంపించివేశారు. ప్రస్తుతం బాంబు స్క్వాడ్ అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు.