: అధికారులూ.. రాజకీయ నేతల మౌఖిక ఆదేశాలు స్వీకరించవద్దు: సుప్రీం


ఐఏఎస్ అధికారులు రాజకీయ నేతల మౌఖిక ఆదేశాలు స్వీకరించవద్దని సుప్రీంకోర్టు సూచించింది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికారులు బాధితులుగా (విక్టిమైజేషన్) మారకుండా చూసేందుకు వీలుగా కీలక సంస్కరణలకు ఆదేశించింది. సివిల్ సర్వీసుల్లోని అధికారుల నియామకాలు, బదిలీలపై నిర్ణయాలు తీసుకోవడానికి, బ్యూరోక్రసీని రాజకీయ జోక్యాలు, అవినీతి నుంచి విముక్తం చేసేందుకు సివిల్ సర్వీసెస్ బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ న్యాయస్థానంలో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో, మూడు నెలల్లో అలాంటి బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

  • Loading...

More Telugu News