: హెల్త్ కార్డులకు పరిమితి ఎత్తివేయండి: అశోక్ బాబు
ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే హెల్త్ కార్డులకు విధించిన పరిమితి ఎత్తి వేయాలని ఏపీఎన్జీవోలు రాష్ట్ర సర్కారును డిమాండ్ చేశారు. పరిమితి ఎత్తివేస్తేనే ముందుకు వెళతామని అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశారు. ప్రతి వ్యాధికీ ప్యాకేజీ నిర్ణయించినప్పుడు వైద్య ఖర్చులకు పరిమితి అవసరం లేదన్నారు. ప్రభుత్వం తయారుచేసిన ప్రతిపాదనలపై సీఎస్ ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు కోరారు. ఈ నేపథ్యంలో తమ అభ్యంతరాలను తెలిపిన ఏపీఎన్జీవోలు.. ప్రభుత్వం విధించదలచుకున్న రెండు లక్షల సీలింగ్ ను ఎత్తివేయాలని, ఓపీ ట్రీట్ మెంట్ ను అందించాలన్నారు. హెల్త్ కేర్ ట్రస్టును ఏర్పాటు చేయాలని సీఎస్ ను కోరినట్లు తెలిపారు. కాగా, దీపావళిలోపు మధ్యంతర భత్యం ఇవ్వాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.