: సహనం కోల్పోయిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహనం కోల్పోయారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆయన వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్ళారు. అక్కడ ఆయనను సమైక్యవాదులు అడ్డుకున్నారు. స్పష్టమైన అభిప్రాయం చెప్పాలని వారు బాబును కోరారు. దీంతో, ఆగ్రహించిన బాబు ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు కూడా కాస్త దూకుడు ప్రదర్శించినట్టు తెలుస్తోంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు.