: జహీర్, సెహ్వాగ్ లకు మళ్ళీ మొండిచేయి


వచ్చే నెలలో విండీస్ తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కు టీమిండియాను ఎంపిక చేశారు. వెటరన్ ఆటగాళ్ళు వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ లకు మరోసారి సెలక్టర్లు మొండిచేయి చూపారు. జాతీయ జట్టులో చోటుపై వీరిద్దరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బోర్డు తాజా నిర్ణయంతో వీరిద్దరి కెరీర్ దాదాపు ముగిసినట్టేనని క్రికెట్ పండితుల అభిప్రాయం. ఇక, విఫలమవుతున్న సురేశ్ రైనాపై వేటు పడింది. అతని స్థానంలో శిఖర్ ధావన్ ను ఎంపిక చేశారు. భుజం గాయంతో బాధపడుతున్న రవీంద్ర జడేజాకు విశ్రాంతి కల్పించారు. నవంబర్ 6 నుంచి జరిగే తొలి టెస్టుతో విండీస్ పర్యటన మొదలవుతుంది. జట్టు వివరాలు.. మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, రవిచంద్రన్ అశ్విన్, ప్రజ్ఞాన్ ఓజా, అమిత్ మిశ్రా.

  • Loading...

More Telugu News