: పరిమితి ఎత్తివేయకుంటే స్కీములో చేరం: టీఎన్జీవోలు
ఎలాంటి పరిమితులు విధించకుండా హెల్త్ కార్డులు జారీ చేయాలని టీఎన్జీవో అద్యక్షుడు దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఉద్యోగ సంఘాల భేటీ సందర్భంగా మాట్లాడుతూ, పరిమితి ఎత్తి వేయకుంటే స్కీములో చేరే ప్రసక్తి లేదని సీఎస్ కు తేల్చిచెప్పినట్టు దేవీప్రసాద్ తెలిపారు. రెండు రాష్ట్రాలు ఏర్పడుతున్నందును వేర్వేరుగా హెల్త్ కేర్ ట్రస్టులు ఏర్పాటు చేయాలని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కోరారు.