: జడ్జి గారూ అనుమతిస్తే.. ఆ నలుగురినీ కుమ్ముతా: అత్యాచార బాధితురాలు
ముంబైలోని శక్తి మిల్స్ లో నెల క్రితం సామూహిక అత్యాచారానికి గురైన ఫొటో జర్నలిస్టు, జడ్జిని ఒక కోరిక కోరింది. ఈ కేసును ముంబైలోని స్థానిక కోర్టు విచారిస్తోంది. తనపై అత్యాచారానికి ఒడిగట్టిన ఆ నలుగురు నిందితులనూ కొట్టాలని ఉందని, అనుమతించాలని ప్రిన్సిపల్ జడ్జి షాలినీ ఫన్ సల్కార్ జోషిని కోరింది. అందుకు జడ్జి 'నో' చెప్పారు.