: 14 మృతదేహాలు గుర్తించాల్సి ఉంది: పాలమూరు కలెక్టర్
మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న జరిగిన బస్సు దహనం ఘటనలో చనిపోయిన వారిలో 14 మంది మృతదేహాలు గుర్తించాల్సి ఉందని ఆ జిల్లా కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఇప్పటివరకు 28 మంది మృతుల బంధువుల రక్త నమూనాలు సేకరించామని, ఈ ఫలితాలు వారంలో వచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. దూరప్రాంతాల నుంచి వచ్చే మృతుల బంధువులకు వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు.