: సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ శాఖ దాడులు
తమిళ సినీ ప్రముఖుల ఇళ్లపై ఆదాయపన్ను అధికారులు దాడులు నిర్వహించారు. చెన్నైలో ఉన్న కొందరు నిర్మాతలు, నటుల ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించి సోదాలు చేశారు. ఒకేసారి భారీ ఎత్తున సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులకు దిగడం ఇదే తొలిసారి. నిర్మాతలు ఏఎమ్ రత్నం, ఆర్బీ చౌదరి, జ్ఞానవేల్ రాజా, ప్రముఖ హాస్యనటుడు సంతానం కూడా ఐటీ దాడులు ఎదుర్కొన్నవారిలో ఉన్నారు. అయితే, దాడులకు సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.