: బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు ఢిల్లీ కోర్టు సమన్లు
భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డుకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసిన వ్యవహారంలో సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ కొన్నిరోజుల కిందట పరువునష్టం దావా కేసు వేశారు. ఒక్కో పార్లమెంటరీ సభ్యుడు తనకు రూ.50 లక్షలు చెల్లించాలని, బోర్డు నిర్ణయాన్ని రద్దు చేయాలని కూడా అందులో కోరారు. దీనిని పరిశీలించిన కోర్టు ఈ మేరకు సమన్లు ఇచ్చింది. ఇందులో మాజీ ప్రధాని వాజ్ పేయి, నరేంద్ర మోడీకి మినహాయింపు ఉంది.