: సంపదలోనూ సచిన్ మొనగాడే..
భారత క్రికెట్ భగవంతుడు సచిన్ టెండూల్కర్ రికార్డులు నెలకొల్పడంలోనే కాదు, టీమిండియా క్రికెటర్లందరిలోకెల్లా ఆదాయం పరంగానూ అగ్రస్థానంలో నిలిచాడు. వెల్త్ ఎక్స్ అనే సంస్థ చేపట్టిన సర్వేలో సచిన్ వెయ్యికోట్లతో సంపన్న భారత క్రికెటర్ల జాబితాలో నెంబర్ వన్ పీఠం దక్కించుకున్నాడు. సర్వే ప్రకారం.. సచిన్ ఆస్తుల విలువ ధోనీ కంటే మూడు రెట్లు, యువరాజ్ సింగ్ కంటే ఐదు రెట్లు, విరాట్ కోహ్లీ కంటే ఎనిమిది రెట్లు, రాహుల్ ద్రావిడ్ కి పది రెట్లు ఎక్కువ. సచిన్ కు క్రికెట్ ద్వారానే కాకుండా, వాణిజ్య ప్రకటనలు, ఒప్పందాల రూపంలో భారీగా ఆదాయం లభిస్తున్న సంగతి తెలిసిందే.